రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ బాలీవుడ్ రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ నటనకు మంచి పేరొచ్చింది. కానీ రణవీర్ తో పాటు విలన్ రోల్ చేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నాకు అంతకు మించి పేరొచ్చిన మాట వాస్తవం. కొన్ని సీన్లలో అయితే రణ్ వీర్ కంటే అక్షయ్ ఖన్నానే బాగా నటించాడని కూడా క్రిటిక్స్ తో పాటు ఆడీయన్స్ ప్రశంసించారు. ఇంతటి సంచలనాలు నమోదు చేసిన ఈ సినిమాలో ఛాన్స్ వదులుకున్నాడట టాలీవుడ్ సీనియర్ నటుడు.
ధురంధర్ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కాకుండా మన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను సంప్రదించారట. విలన్ క్యారెక్టర్ కోసం నాగార్జునకు కథ కూడా వినిపించారట. కథ నాగ్ కు చాలా బాగా నచ్చిందట. కానీ అదే టైమ్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’, ధనుష్ హీరోగా చేసిన ‘కుబేర’ వంటి సినిమాలలో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు ఒకేసారి షూట్ చేస్తుండడంతో ధురంధర్ కు డేట్స్ కు అడ్జస్ట్ చేయడం కూడా కుదరక ధురంధర్ ను నాగార్జున వదులుకోవాల్సి వచ్చిందట. దాంతో నాగ్ ను కాదని చివరకు అక్షయ్ ఖన్నాను విలన్ పాత్రకు ఎంపిక చేశాడట దర్శకుడు ఆదిత్య థార్. అక్షయ్ ఖన్నా కూడా ఈ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ, ఒకవేళ నాగార్జున ఈ సినిమాలో నటించి ఉంటే మరింత ప్రత్యేకంగా ఉండేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగార్జున ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో ధురంధర్‌లో కనిపించి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
