టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ రచ్చ జరుగుతోంది, ఎందుకంటే సాధారణంగా పండగ సీజన్లో రెండు లేదా మూడు పెద్ద సినిమాలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, 2026 సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు మంచి బజ్ ఉన్న సినిమాలు రావడంతో థియేటర్ల వద్ద జన సందోహం కనిపిస్తోంది. ఈసారి సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మరియు శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆశ్చర్యకరంగా, విడుదలైన ఐదు సినిమాల్లో నాలుగు చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఏ సినిమా చూడాలనే సందిగ్ధంలో పడిపోయారు.
Also Read : Suriya46 : సూర్య-వెంకీ అట్లూరి సినిమా OTT రైట్స్ ఫిక్స్..
ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. పండగ సెలవులకు పల్లెటూళ్లకు వెళ్లిన జనం భారీగా థియేటర్ల బాట పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోని థియేటర్లకు కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తున్న వారికి ‘హౌస్‌ఫుల్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్స్‌లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోతుండటంతో, నేరుగా కౌంటర్ల వద్దకు వస్తున్న సామాన్య ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే సినిమాల సంఖ్య పెరగడంతో థియేటర్ల కేటాయింపు డిస్త్రిబ్యూటర్లకు పెద్ద సవాలుగా మారింది. ఒక్కో సినిమాకు మంచి స్పందన వస్తున్నా, తగినన్ని స్క్రీన్లు లేక షోల సంఖ్యను పెంచలేకపోతున్నారు.
Also Read :Suriya46 : సూర్య-వెంకీ అట్లూరి సినిమా OTT రైట్స్ ఫిక్స్..
థియేటర్ల కొరత వల్ల కొన్ని చోట్ల తెల్లవారుజామున 1 గంటకు కూడా షోలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడుదలైన సినిమాల్లో 80% చిత్రాలు విజయవంతమైన టాక్‌ను సంపాదించుకున్నాయి, ఐదు సినిమాలు ఒకేసారి ఉండటంతో థియేటర్ల సర్దుబాటు అసాధ్యంగా మారింది. టికెట్లు దొరక్కపోయినా సరే, థియేటర్ల వద్ద వేచి చూస్తున్న అభిమానుల తాకిడి తగ్గడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఈ స్థాయి రద్దీని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఊహించలేదు, ఒకవైపు భారీ వసూళ్లు వస్తున్నా, మరోవైపు థియేటర్ల కొరత వల్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతున్నామనే ఆవేదన పంపిణీదారుల్లో కనిపిస్తోంది. మొత్తం మీద, ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఒక తీపి జ్ఞాపకంగానూ, అదే సమయంలో ఒక పెద్ద లెసన్ గానూ నిలిచిపోనుంది.