Pawan Kalyan : నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన ప్రతిరోజూ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన దర్బార్ ద్వారా పవన్ కళ్యాణ్ తన సహాయాన్ని కోరేందుకు వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం విజయవాడలోని పవన్ క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు పవన్ కల్యాణ్‌ని కలవనున్నారు. ఈ సమావేశంలో అశ్వినీదత్, చినబాబు, నవీన్ యెర్నేని, రవిశంకర్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోధర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొంటారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించడం, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాల కారణంగా ప్రస్తుతం టీఎఫ్‌ఐ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం రేపటి సమావేశం ఎజెండా. టికెట్ ధరల్లో వెసులుబాటు, థియేటర్లలో ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!