NTV Telugu Site icon

Tollywood Producer: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఇంట్లో తీవ్ర విషాదం!

Shyam Prasad Reddy

Shyam Prasad Reddy

Producer Shyam Prasad Reddy Wife Vara Lakshmi Dead: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాన్సర్ మహమ్మారితో పోరాడిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే వరలక్ష్మి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి హిట్ సినిమాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.

Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే.. అత్యంత ముఖ్యమైన రోజు! పతకాలు పక్కా

ప్రస్తుతం ‘జబర్దస్త్’ కామెడీ షోకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఢీ, క్యాష్, స్టార్ మహిళ వంటి పలు ఎంటర్టైన్మెంట్ షోలకి కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు. అందుకే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. జబర్దస్త్ షోలో చేసిన చాలామంది ప్రస్తుతం సినిమాల్లో చేస్తున్నారు.

Show comments