Tollywood: అమెరికా పారిపోయిన నిర్మాత

Producer

Producer

Tollywood: టాలీవుడ్‌లో ఒక చిన్న సినిమా చేసిన నిర్మాత అమెరికా పరారవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో కొత్త నిర్మాతలు చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఒక ఎన్నారై నిర్మాత తెలుగులో క్రీడా నేపథ్యంలో ఓ చిన్న సినిమా చేశారు. కొత్త నటీనటులతో రూపొందించబడిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో కూడా సినిమాకి మంచి ఏర్పడింది.

READ ALSO: Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్.. కారణం ఇదే..

అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో పబ్లిసిటీ చేయించిన నిర్మాత ఇప్పుడు ఆ పబ్లిసిటీ ఖర్చులు ఇవ్వకుండా అమెరికా వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. సదరు నిర్మాతను నమ్మి పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చు పెట్టిన పబ్లిసిటీ టీం ఇప్పుడు ఆయన అమెరికా వెళ్లిపోవడం, ఫోన్లకు సరిగా స్పందించకపోవడంతో ఏం చేయాలో తెలియక పాలుపోయిన స్థితిలో పడిపోయింది. నిజానికి పెద్ద నిర్మాతలు ఒక సిస్టమాటిక్‌గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు. కానీ కొత్త నిర్మాతలు ఇలా హ్యాండ్ ఇస్తూ వస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఈ అంశం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

READ ALSO: Mobile Recharge Controversy: పార్లమెంటులో రీఛార్జ్ సెగ.. 12 నెలలకు 13 రీఛార్జ్ లా? కేంద్రంపై ఎంపీల ప్రశ్నల వర్షం!