NTV Telugu Site icon

Cheating Case: పెళ్లి పేరుతో మోసం.. మహిళా సినీ నిర్మాతపై కేసు..

Tollywood

Tollywood

డబ్బుల కోసం పెళ్లి పేరుతో మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న ఓ మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్, వెంకటగిరిలో నివాసముంటున్న నాగార్జున బాబు సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అతడికి ‘బైరవపురం’ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర నిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశా మల్లికతో పరిచయం ఏర్పడింది. సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన ఇంటికి డిన్నర్ కు రావాలని ఆమె కోరడంతో నాగార్జున బాబు వెళ్లాడు. డిన్నర్ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత తాను గర్భం దాల్చానని, తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని, తన భర్తతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె నమ్మించింది.

Read Also: Hari Hara Veera Mallu : పవన్ కల్యాణ్, క్రిష్ కాంబో మూవీ ఆగిపోయినట్లేనా..?

తనను పెళ్లి చేసుకోవాలని నిర్మాత ఆశా మల్లికా కోరగా చిలుకూరి బాలాజీ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే, కొన్నాళ్ల తర్వాత తనకు అర్జెంట్ గా డబ్బులు కావాలనీ ఆమె కోరడంతో 18.5 లక్షల రూపాయల నగదు ఇచ్చి.. మరో 10 లక్షల రూపాయలను ఆమె అకౌంట్ కు పంపించాడు. ఇక, డబ్బులు తీసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ గొడవలు జరిగాయి.. ఇటీవల ఆమె గురించి వాకబు చేయగా గతంలోనే రెండు పెళ్లిళ్లు కావ డంతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని నిలదీయడంతో అతడిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు నమోదు చేయించింది.

Read Also: Central Govt: ఎస్సీ వర్గీకరణకు కేంద్రం మద్దతు.. వివక్షకు గురైన వర్గాలకు న్యాయం జరగాలి..

ఇదిలా ఉండగా ఆశా మల్లిక గతంలోనూ పలువురు వ్యక్తులను ఇదే విధంగా ముగ్గులోకి దింపి మోసం చేయడంతో పాటు వారిపై కేసులు పెట్టింది. కాగా, తాను నమోదు చేయించిన కేసును రాజీ చేసుకోవాలంటే ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని బెదిరిస్తోందని నాగార్జునబాబు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆశా మల్లికకు సంబంధించిన మోసాల చిట్టాను ఇచ్చాడు. దీంతో ఆమెపై 389, 420, 419, 494 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments