NTV Telugu Site icon

Tollywood Industry Meeting Live Updates: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం.. లైవ్‌ అప్‌డేట్స్!

Cine Celebretis

Cine Celebretis

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నేడు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో చర్చ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఇండస్ట్రీలోని సమస్యలతో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు వివరించనున్నారు. అలాగే, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన.. చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు లాంటి విషయాలు చర్చలో తీసుకురానున్నారు.

 

  • 26 Dec 2024 02:12 PM (IST)

    సినీ పరిశ్రమకు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి..

    సినీ పరిశ్రమకు ఏది చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి.. ఆ
    వారసత్వాన్ని కొనసాగిస్తాం: తెలంగాణ ప్రభుత్వం

  • 26 Dec 2024 02:06 PM (IST)

    అల్లు అర్జున్పై నాకెందుకు కోపం..

    సినిమా ప్రముఖుల భేటీలో అల్లు అర్జున్, రామ్చరణ్ల ప్రస్తావన.. అల్లు అర్జున్పై నాకెందుకు కోపం ఉంటుంది.. అల్లు అర్జున్, రామ్చరణ్ ఇద్దరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. వారిద్దరు నాతో కలిసి తిరిగారు.. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్న చట్ట ప్రకారం వ్యవహరించాలన్నది నా విధానం: సీఎం రేవంత్ రెడ్డి

  • 26 Dec 2024 01:35 PM (IST)

    టాలీవుడ్ కు మేం వ్యతిరేకం కాదు: సీఎం రేవంత్

    టాలీవుడ్ కు మేం వ్యతిరేకం కాదు.. కానీ నిబంధనలు పాటించాల్సిందే.. బెనిఫిట్ షోలు ఇక ఉండవ్.. ప్రత్యేకంగా టికెట్ రేట్ల పెంపు ఇక ఉండదు: సీఎం రేవంత్ రెడ్డి

  • 26 Dec 2024 01:16 PM (IST)

    బెనిఫిట్ షోలు, టికెట్ రెట్ల పెంపు అంశం చిన్నది..

    బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశం చాలా చిన్నది.. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో నివేదిక ఇస్తాం: దిల్ రాజు

  • 26 Dec 2024 01:14 PM (IST)

    ప్రభుత్వానికి- టాలీవుడ్ కు గ్యాప్ లేదు: దిల్ రాజు

    దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోంది.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పని చేయాలని నిర్ణయించాం.. హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమా షూటింగ్స్ జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు.. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తాం.. సామాజిక కార్యక్రమాల్లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉండాలని ప్రభుత్వం కోరింది.. డ్రగ్స్, గంజాయిపై పోరాటంలో సినిమా హీరోలు పాల్గొంటారు.. కొన్ని ఘటనల వల్ల ప్రభుత్వానికి, టాలీవుడ్ కు గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది.. ఇండస్ట్రీకి ఏమేం కావాలో మేం సీఎంను కోరాం: దిల్ రాజు

  • 26 Dec 2024 01:09 PM (IST)

    తెలుగు సినీ పరిశ్రమ బ్రాండ్ క్రియేట్ చేయాలి: సీఎం రేవంత్

    8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది.. తెలుగు సినీ పరిశ్రమ బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. ఐటీ, ఫార్మాతో పాటు సినీ పరిశ్రమ కూడా మాకు ముఖ్యం.. తెలంగాణలో అవార్డులు ఇవ్వండం లేదని తెలిసి.. గద్దర్ అవార్డులు ఏర్పాటు చేశాం.. దిల్ రాజును FDC చైర్మన్ గా నియమించాం.. సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

  • 26 Dec 2024 01:03 PM (IST)

    కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన సీఎం రేవంత్..

    కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్.. ప్రత్యేక విమానంలో బెళగావి వెళ్లనున్న రేవంత్.. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్.. టాలీవుడ్ పెద్దలతో 2 గంటల పాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం.. భేటీలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన రేవంత్..

  • 26 Dec 2024 12:48 PM (IST)

    సినీ పెద్దలతో సమావేశం తర్వాత అధికారులతో సీఎం రేవంత్ భేటీ..

    సినీ పెద్దలతో సమావేశం తర్వాత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి,డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ.. సీసీసీలోని ఏడో ఫ్లోర్ లో డీజీపీ, సీఎంవో అధికారులతో ప్రత్యేక భేటీ.. సమావేశంలో పాల్గొన్న FDC ఛైర్మన్ దిల్ రాజు..

  • 26 Dec 2024 12:34 PM (IST)

    సీఎం, డిప్యూటీ సీఎంతో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ..

    సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ.. భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సమావేశం.. రెండు గంటల పాటు సాగిన సమావేశం

  • 26 Dec 2024 12:32 PM (IST)

    తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి..

    తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ లు ఉన్నాయి.. చిల్డ్రన్స్ ఫెస్టివల్ ను ప్రభుత్వం నిర్వహించాలి: రాఘవేంద్రరావు

  • 26 Dec 2024 12:14 PM (IST)

    ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది: సురేశ్ బాబు

    తెలంగాణ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది.. ప్రభుత్వాల చొరవతోనే ఆనాడు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలు హైదరాబాద్ కేరాఫ్ గా ఉండాలి: నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు

  • 26 Dec 2024 12:13 PM (IST)

    హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలి: నాగార్జున

    యూనివర్సల్ లెవల్ లో స్టూడియో సెటప్ ఉండాలి.. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటీవ్స్ ఇస్తేనే పరిశ్రమ ఎదుగుతుంది.. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావలన్నది మా కోరిక: హీరో నాగార్జున

  • 26 Dec 2024 12:07 PM (IST)

    సినీ ప్రముఖులతో సీఎం, డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..

    సినీ ప్రముఖులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు.. పరిశ్రమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సీఎం, డిప్యూటీ సీఎంలు.. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని తేల్చి చెప్పిన: రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

  • 26 Dec 2024 11:59 AM (IST)

    సినిమా పెద్దలకు పోలీసుల సూచనలు..

    సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని పాటించాలి.. పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారు.. పోలీసులు నిర్ణయాన్ని టాలీవుడ్ పెద్దలు గౌరవించాలి.. బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలి.. ఇటివల బౌన్సర్లు తీరు, ప్రవర్తన బాగలేదు: తెలంగాణ డీజీపీ

  • 26 Dec 2024 11:53 AM (IST)

    సంధ్య థియేటర్ ఘటన తమను బాధించింది: టాలీవుడ్ పెద్దలు

    సినీ ప్రముఖుల ముందు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వీడియోలను ప్రదర్శించిన పోలీసులు.. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందన్న టాలీవుడ్ పెద్దలు..

  • 26 Dec 2024 11:49 AM (IST)

    ప్రభుత్వంపై నమ్మకం ఉంది..

    తెలంగాణ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందన్న టాలీవుడ్ పెద్దలు..

  • 26 Dec 2024 11:45 AM (IST)

    ఆ బాధ్యత కూడా సినీ పరిశ్రమదే..

    టెంపుల్ టూరిజం, ఎకో టూరిజాన్ని టాలీవుడ్ ప్రమోట్ చేయాలి.. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలి..
    అలాగే, సినిమా రిలీజ్, ఈవెంట్స్ సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే: సీఎం రేవంత్

  • 26 Dec 2024 11:42 AM (IST)

    ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం..

    తెలంగాణలో షూటింగ్స్ కు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామన్న ప్రభుత్వం.. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామని తెలిపిన ప్రభుత్వం.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం.. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

  • 26 Dec 2024 11:35 AM (IST)

    టాలీవుడ్ కు మేం వ్యతిరేకం కాదు: ప్రభుత్వం

    సంధ్య థియేటర్ ఘటనపై సమావేశంలో చర్చ.. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడం వంటివి చేయలేదు.. టాలీవుడ్ కు మేం వ్యతిరేకం కాదని తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ రోజు ఏం జరిగిందో వీడియోలను ప్రదర్శించిన చిక్కడపల్లి పోలీసులు..

  • 26 Dec 2024 11:31 AM (IST)

    మమ్మల్ని ఈ ప్రభుత్వం బాగా చూసుకుంటుంది: రాఘవేంద్రరావు

    అందరు సీఎంలు సినీ ఇండస్ట్రీని బాగా చూసుకుంటున్నారు.. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది.. దిల్ రాజును FDC ఛైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాం: రాఘవేంద్రరావు

  • 26 Dec 2024 11:29 AM (IST)

    సీఎంతో భేటీ అయిన ప్రముఖులు వీరే..

    సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు.. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేశ్, సి. కళ్యాణ్, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, కొరటాల శివతో పాటు మరికొందరు ఉన్నారు..

  • 26 Dec 2024 11:25 AM (IST)

    సినీ ప్రముఖులతో సీఎం కీలక వ్యాఖ్యలు..

    సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. సినీ పరిశ్రమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్.. ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటాం.. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు.. డ్రగ్స్, మహిళా భద్రతకు సినీ పరిశ్రమ సహకరించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • 26 Dec 2024 11:11 AM (IST)

    తొక్కిసలాటపై సినీ ప్రముఖులకు వీడియోలు చూపించనున్న పోలీసులు

    సంధ్య థియేటర్ ఘటనను ప్రముఖుల ముందు ఉంచనున్న చిక్కడపల్లి పోలీసులు.. తొక్కిసలాట వీడియోలు సినీ ప్రముఖులకు చూపించనున్న పోలీసులు..

  • 26 Dec 2024 11:06 AM (IST)

    సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే..

    టాలీవుడ్ కు ప్రభుత్వ ప్రతిపాదనలు..
    1. డ్రగ్స్కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి..
    2. డ్రగ్స్కు వ్యతిరేకంగా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో కచ్చితంగా పాల్గొనాలి..
    3. సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెట్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి..
    4. బెనిఫిట్ షోలు, స్పెషల్గా టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చు..
    5. కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో తారలు సహకరించాలి..

  • 26 Dec 2024 11:01 AM (IST)

    ప్రారంభమైన చర్చలు..

    టాలీవుడ్ పెద్దలతో మొదలైన తెలంగాణ ప్రభుత్వం చర్చలు.. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన టాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు..

  • 26 Dec 2024 10:56 AM (IST)

    సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

    సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభమైన సినీ ప్రముఖుల భేటీ.. కీలక అంశాలపై చర్చ..

  • 26 Dec 2024 10:36 AM (IST)

    కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీఎం రేవంత్..

    కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

  • 26 Dec 2024 10:33 AM (IST)

    సినీ ఇండస్ట్రీతో చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలు..

    టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు.. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో ఖచ్చితంగా పొల్గొనాలంటున్న సర్కార్.. సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలంటున్న ప్రభుత్వం.. కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో తారలు సహకరించాలి..

  • 26 Dec 2024 10:11 AM (IST)

    కమాండ్ కంట్రోల్ కి క్యూ కట్టిన సినీ ప్రముఖులు..

    కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన హీరోలు నాగార్జున, కిరణ్ అబ్బవరం, పుష్ప మూవీ నిర్మాత ఎలమంచిలి రవి, దిల్ రాజు, నిర్మాత సి. కళ్యాణ్, అల్లు అరవింద్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, బోయపాటి శ్రీను, సినీనటుడు శివబాలాజీ,

  • 26 Dec 2024 10:07 AM (IST)

    కాసేపట్లో సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

    కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పలు ప్రధాన అంశాలపై చర్చ.. గద్దర్ అవార్డుల పరిశీలన, ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై చర్చించే అవకాశం..

  • 26 Dec 2024 09:45 AM (IST)

    ప్రభుత్వ నిర్ణయంపైనే సినిమాల భవితవ్యం..

    సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపైనే సంక్రాంతి సినిమాల భవితవ్యం..

  • 26 Dec 2024 09:44 AM (IST)

    కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్న సినీ ప్రముఖులు

    కమాండ్ కంట్రోలో సెంట్రర్ కు చేరుకున్న మురళీ మోహన్, రాఘవేంద్రరావు, నాగార్జున, సి. కళ్యాణ్, అల్లు అరవింద్, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, బోయపాటి శ్రీను, శివబాలాజీ..

  • 26 Dec 2024 09:42 AM (IST)

    సీఎంతో భేటీలో సినీ ప్రముఖులు ఏం చర్చించనున్నారు..?

    బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండబోవన్న అసెంబ్లీ ప్రకటనకు కట్టుబడి ఉంటుందా?.. సీఎంను సినీ ప్రముఖులు ఎలా ఒప్పిస్తారన్న దానిపై ప్రజల ఆసక్తి..

  • 26 Dec 2024 09:37 AM (IST)

    కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన సినీ ప్రముఖులు..

    పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న సినీ ప్రముఖులు.. కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరకు చేరుకున్న దిల్ రాజు, త్రివిక్రమ్, హరీశ్ శంకర్.. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం..

  • 26 Dec 2024 09:35 AM (IST)

    ప్రభుత్వం, సినీ ప్రముఖుల భేటీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలు

    సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్న సినీ ప్రముఖులు.. ప్రభుత్వం, సినీ ప్రముఖుల సమావేశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలు.. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందా?.. సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు.. ప్రభుత్వ నిర్ణయంపైనే సంక్రాంతి సినిమాల భవితవ్యం.. అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత టాలీవుడ్, ప్రభుత్వం మధ్య పెరిగిన దూరం..

  • 26 Dec 2024 09:30 AM (IST)

    సినీ ప్రముఖుల భేటీలో పాల్గొనే మంత్రులు వీరే..

    కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు.. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా హాజరు.. ఈ భేటీలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పలు ప్రధాన అంశాలపై భేటీలో చర్చ.. గద్దర్ అవార్డుల పరిశీలన, ఇటీవల సంధ్య థియేటర్ వద్ద ఘటనపై చర్చించే అవకాశం.. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు లాంటి అంశాలపై చర్చించే ఛాన్స్..

  • 26 Dec 2024 09:23 AM (IST)

    సీఎం రేవంత్ వద్దకు దిల్రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యులు..

    సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యులు.. హీరోల నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, వరుణ్ తేజ్, నితీన్, కిరణ్ అబ్బవరం, బాలాజీ, నిర్మాతల నుంచి దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, పుష్ప నిర్మాతలు.. దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్, డైరెక్టర్స్ త్రివిక్రమ్, హరీశ్ శంకర్, బాబీ, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ..

  • 26 Dec 2024 09:18 AM (IST)

    నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ..

    నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం.. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో భేటీ కానున్న సీఎం

Show comments