టాలివుడ్ లో స్టార్ హీరోలుగా రానిస్తున్న కొందరు హీరోలు వెండితెర మీద మాత్రమే కాదు.. బుల్లితెర పై కూడా రానిస్తున్నారు.. జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.. హోస్ట్ లు గా మారి..పెద్ద పెద్ద కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ చేస్తున్నారు.వాళ్లు ఎవరో ఏ షోతో పాపులర్ అయ్యారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నాగార్జున..
టాలివుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున బుల్లితెరపై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తున్నారు.. ఆ షో కు జనాల్లో మంచి క్రేజ్ ఉంది.. ఈ షో ఇప్పుడు ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే.. ప్రస్తుతం ఏడో సీజన్ ముగింపుదశలో ఉంది. ఇక నాగార్జున తెలుగు బిగ్ బాస్ కు బ్రాండ్ గా మారిపోయారు..
బాలకృష్ణ..
బాలయ్య బాబు ఆహాలో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంతో రచ్చ చేశాడు. బాలయ్య హోస్ట్ గా ఎలా ఉంటాడా అని సందేహంతో ఉన్నవారికి తనయాంకరింగ్ తో అదరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. అంతే కాదు రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ చేసిన బాలకృష్ణ.. ప్రస్తుతం మూడో సీజన్ ను స్టార్ట్ చేశారు.. ఈ షోకు అతి తక్కువ కాలంలోనే బాగా పాపు్లారిటీ దక్కింది.. అలాగే ఎక్కువ మంది సెలెబ్రేటీలు కూడా ఈ షోకే వచ్చారు..

మెగాస్టార్ చిరంజీవి..
మీలో ఎవ్వరు కోటీశ్వరుడు మొదటి సీజన్ ను నాగార్జున నటించగా, రెండో సీజన్ చిరంజీవి చేశారు.. ఆ సీజన్ అనుకున్నంత రిజల్ట్ ను రాబట్ట లేకపోయింది. ఆతరువాత ఆయన అటు వైపు చూడలేదు.

నాని..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1ను ఎన్టీఆర్ నడిపిస్తే.. సీజన్ 2 నాని హోస్ట్ గా చేశారు. కాని ఈ సీజన్ వల్ల నాని చాలా విమర్షలు ఫేస్ చేశారు. కంటెస్టెంట్స్ ను హ్యాండిల్ చేయడం రాలేదని విమర్శలు కూడా అందుకున్నాడు..

మంచు మనోజ్ హోస్ట్ అవతారం ఎత్తాడు. గతంలో మన తెలుగు హీరోలు హోస్ట్ లుగా సక్సెస్ అవ్వడంతో.. మనోజు కూడా ఇటు వైపు అడుగులు వేశాడు. ఉస్తాద్.. ర్యాంప్ ఆడిద్దాం అంటూ గేమ్ షోతో వచ్చేస్తున్నారు మంచు మనోజ్. ఈటీవీకి సబంధించిన ఓటిటిలో డిసెంబర్ 15 నుంచి.. ఈ షో అది రానుంది.. ఇక అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ మధ్యే ఆహాలో ఫ్యామిలీ ధమాకాతో బాగానే ఆకట్టుకుంటున్నారు. వరస సినిమాలతో పాటు గేమ్ షోకు డేట్స్ ఇచ్చారు మాస్ కా దాస్.. రానా కూడా హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే..