NTV Telugu Site icon

Jr NTR: ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్!

Devaraaa

Devaraaa

Vishwak Sen interviewed Jr NTR for Devara: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్‌ ఇండియా సినిమా సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ‘జన‌తా గ్యారేజ్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లలో తారక్ బిజీగా ఉన్నారు.

ముంబైలో గత కొన్ని రోజులుగా జరిగిన దేవర ప్రమోషన్స్‌లలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చిన టైగర్.. తెలుగు ప్రమోషన్స్‌లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‏లు తారక్‏తో ప్రత్యేక చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబందించిన ఓ ఫోటోను చిత్ర యూనిట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఎన్టీఆర్‌ను సిద్ధు, విశ్వక్ కలిసి ఒకేసారి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇద్దరు టైగర్‌ను ఇరుకున పెట్టేందుకు పలు ప్రశ్నలు సాధించగా.. తెలివిగా ఆన్సర్ ఇచ్చారు.

Also Read: Crime News: ఆస్తి కోసం.. బావమరిదిని హత్య చేసిన బావ! చివరకు

దేవర రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విల‌న్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప‌నులు పూర్తిచేసుకుంది. సెన్సార్‌ బోర్డు స‌భ్యులు ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేశారు. దేవర రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. ఇక దేవర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.