Site icon NTV Telugu

Ileana D’Cruz: రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. పిక్ వైరల్!

Ileana D'cruz

Ileana D'cruz

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా డీక్రూజ్‌ మరోసారి తల్లి అయ్యారు. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చారు. జూన్‌ 19న తాను మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫొటో షేర్ చేసిన ఇలియానా.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘కియాను రఫే డోలన్‌ని పరిచయం చేస్తున్నా. జూన్‌ 19న పుట్టాడు. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’ అని రాసుకొచ్చారు. ఇలియానాకు ప్రముఖులు, ఫాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.

2023 మేలో మైఖేల్‌ డోలన్‌, ఇలియానా డీక్రూజ్‌ రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2023 ఆగస్టులో ఇలియానా మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’గా నామకరణం చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండో బిడ్డకు ఇలియానా జన్మనిచ్చారు. ఇలియానా ఇద్దరు కొడుకులు. మైఖేల్‌ డోలన్‌ విదేశీయుడు అన్న విషయం తెలిసిందే.

Also Red: Swecha Votarkar: ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య!

ఇలియానా డీక్రూజ్‌ ‘దేవదాస్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దేవదాసు, పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగారు. తెలుగులో చివరిసారి 2018లో రవితేజ నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో సినిమాలు చేశారు. ఇలియానా చివరగా ‘దో ఔర్‌ దో ప్యార్‌’ సినిమాలో నటించారు. ‘రైడ్‌ 2’లో నటించే అవకాశం వచ్చినా వదిలేసుకున్నారు.

Exit mobile version