Sharwanand: హీరో శర్వానంద్‌కు బిరుదు.. ఏ స్టార్ అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand As Charming Star: టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మనమే చిత్రం శుక్రవారం (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్‌కు బిరుదు ఇచ్చారు.
మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ హీరో శర్వానంద్‌కు ఓ బిరుదు ఇచ్చారు. ‘చామింగ్ స్టార్ శర్వా’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఇకనుంచి శర్వాను చామింగ్ స్టార్ అని పిలవనున్నారు. చామింగ్ స్టార్ శర్వానంద్ అని ఫాన్స్ పిలుసుకోవచ్చు. వాస్తవానికి మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నారు. ఎన్నికల హడావుడి కారకంగా అనుమతి లభించలేదు. దాంతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈవెంట్ నిర్వహించారు. సక్సెస్ పార్టీని పిఠాపురంలో చేయాలనీ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని శర్వా తెలిపాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: 8 Vasanthalu Movie Update: మీరు తనని రేపు చూస్తారు.. ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ పోస్టర్!
మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలే ఇవ్వాలని నేను చూస్తుంటా. సమయం ఎంత విలువైందో ఇందులో చూపించాం. అలా అని సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మనమే చిత్రం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చివరి 40 నిమిషాలు మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. మూవీ తప్పక హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టును ఎంతగానో ప్రేమించా. శ్రీరామ్ ఆదిత్య చాలా ప్రతిభావంతుడు. నిజానికి ఈ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నాం. కానీ అనుమతి లభించలేదు. సక్సెస్ పార్టీ అయినా అక్కడ ప్లాన్ చేస్తాం’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!