Site icon NTV Telugu

Sharwanand: హీరో శర్వానంద్‌కు బిరుదు.. ఏ స్టార్‌ అంటే?

Sharwanand

Sharwanand

Sharwanand As Charming Star: టాలీవుడ్ యువ కథానాయ‌కుడు శర్వానంద్‌, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మనమే చిత్రం శుక్రవారం (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శర్వానంద్‌కు బిరుదు ఇచ్చారు.

మనమే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ హీరో శర్వానంద్‌కు ఓ బిరుదు ఇచ్చారు. ‘చామింగ్‌ స్టార్‌ శర్వా’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఇకనుంచి శర్వాను చామింగ్‌ స్టార్‌ అని పిలవనున్నారు. చామింగ్‌ స్టార్‌ శర్వానంద్‌ అని ఫాన్స్ పిలుసుకోవచ్చు. వాస్తవానికి మనమే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నారు. ఎన్నికల హడావుడి కారకంగా అనుమతి లభించలేదు. దాంతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. సక్సెస్‌ పార్టీని పిఠాపురంలో చేయాలనీ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని శర్వా తెలిపాడు.

Also Read: 8 Vasanthalu Movie Update: మీరు త‌న‌ని రేపు చూస్తారు.. ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ పోస్టర్!

మనమే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలే ఇవ్వాలని నేను చూస్తుంటా. సమయం ఎంత విలువైందో ఇందులో చూపించాం. అలా అని సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మనమే చిత్రం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. చివరి 40 నిమిషాలు మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. మూవీ తప్పక హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టును ఎంతగానో ప్రేమించా. శ్రీరామ్‌ ఆదిత్య చాలా ప్రతిభావంతుడు. నిజానికి ఈ ఈవెంట్‌ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నాం. కానీ అనుమతి లభించలేదు. సక్సెస్‌ పార్టీ అయినా అక్కడ ప్లాన్ చేస్తాం’ అని తెలిపాడు.

Exit mobile version