Raj Tarun and Malvi Malhotra’s Chating Leaked: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రాజ్ తరుణ్, నటి మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వీకి రాజ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ ప్రపోజల్‌కు యాక్సెప్ట్ అంటూ మాల్వీ వెంటనే రిప్లై ఇచ్చారు. మాల్వి అనేకసార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేశారు. ఈ ఇద్దరు కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ విషయాలను మాట్లాడుకునేవారు. రాజ్, మాల్వీలు ప్రతిదీ షేర్ చేసుకునేవారని చాట్‌ని బట్టి అర్ధమవుతోంది.
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చాట్ చూస్తుంటే.. రాజ్ వ్యవహారంలో లావణ్య చేసిన ఆరోపణలు నిజమని స్పష్టమవుతోంది. రాజ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాల్వీ మల్హోత్రా పరిచయమయ్యాక రాజ్ తనను దూరం పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపై మాల్వీ, ఆమె సోదరుడు తనను బెదిరించారని.. వారిపై కూడా కేసు పెట్టారు.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
లావణ్యపై రాజ్ తరుణ్ ఫిర్యాదు చేశాడు. తన పరువును బజారుకు ఈడ్చుతోందంటూ లావణ్యపై మాల్వీ మల్హోత్రా కూడా కేసు పెట్టారు. ముగ్గురిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రాజ్ తరుణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. కేసు నడుస్తుండగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ లావణ్య సీన్ చేశారు. రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోన్న ఈ కేసులో తాజాగా రాజ్, మాల్వీల చాట్ బయటకొచ్చింది.
