NTV Telugu Site icon

Raj Tarun Tag: రాజ్‌ తరుణ్‌కి ‘ట్యాగ్’.. ఏంటో తెలుసా?

Raj Tarun

Raj Tarun

Raj Tarun Tag is Jovial Star: టాలీవుడ్ యువ న‌టుడు రాజ్‌ తరుణ్‌ హీరోగా రామ్‌ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఇందులో హాసిని సుధీర్‌ కథానాయిక. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పురుషోత్తముడు సినిమా నేడు (జూలై 26) ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌కి ట్యాగ్ వచ్చింది.

పురుషోత్తముడు టైటిల్స్ సమయంలో ‘జోవియల్ స్టార్’ రాజ్‌ తరుణ్‌ అని వేశారు. ఇంతకుముందు వరకు రాజ్‌ తరుణ్‌కి ట్యాగ్ లేదన్న విషయం తెలిసిందే. షార్ట్ ఫిల్మ్ ద్వారా వెలుగులోకి వచ్చిన రాజ్‌ తరుణ్‌.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ మంచి విజయం సాధించడంతో మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడ్డాయి. ఇప్పటికీ మనోడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం రాజ్‌ తరుణ్‌ ఎదురుచూస్తున్నాడు.

Also Read: Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్‌ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్

ఓవైపు రాజ్‌ తరుణ్‌ సినిమా కెరీర్ అంతమాత్రమే ఉండగా.. ఇదే సమయంలో పర్సనల్‌ లైఫ్‌ కూడా ఇప్పుడు ఓ కుదుపుకు గురైంది. తనను ప్రేమించి, మోసం చేశాడంటూ.. రాజ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజ్‌పై కేసు నమోదు చేశారు. రాజ్‌తో పాటుగా హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది.

Show comments