Site icon NTV Telugu

Committee Kurrollu: త్వరలోనే ‘కమిటీ కుర్రోళ్లు’ చూస్తా: మహేష్ బాబు

Mahesh

Mahesh

Mahesh Babu About Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్‌ 10న విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకుంది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబ భావోద్వేగాల‌ను ఇందులో బాగా చూపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందని ఇండస్ట్రీ ప్రముఖులు ప్ర‌శంసిచారు. తాజాగా ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు.

కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందనే టాక్ తాను విన్నానని మహేష్ బాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు చిత్రం గురించి గొప్ప విషయాలు వినబడుతున్నాయి. సినిమా బాగుందంటున్నారు. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్‌ నిహారిక. చిత్ర బృందంకు అభినందనలు. నేను కూడా త్వరలోనే సినిమా చూస్తా’ అని మహేష్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Rohit Sharma-RCB: ఆర్‌సీబీ‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. దినేశ్ కార్తీక్ ఏమన్నాడంటే?

కమిటీ కుర్రోళ్లు చిత్రంకు యదు వంశీ దర్శకత్వం వచించారు. ఈ చిత్రంతో దాదాపు 16 మంది నూతన నటీనటులు పరిచయం అయ్యారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్ర‌శంస‌ల‌తో పాటు సినిమాకు మంచి క‌లెక్ష‌న్స్ కూడా వ‌చ్చాయి. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. వీకెండ్ కావడంతో క‌లెక్ష‌న్స్‌ ఊపందుకున్నాయి.

Exit mobile version