Site icon NTV Telugu

Akash Puri: పేరు మార్చుకున్న ‘పూరీ’ కుమారుడు.. కారణం అదేనా?

Akash Jagannadh

Akash Jagannadh

Director Puri Jagannadh Son Akash Puri Changed His Name: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరీ బాల్య నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిరుత, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో బుల్లి హీరోగా అలరించారు. ‘ఆంధ్రాపోరీ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌.. మెహబూబా, రొమాంటిక్‌, చోర్‌ బజార్‌ సినిమాల్లో నటించారు. ఆకాశ్‌ చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఈ యువ హీరో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆకాశ్‌ తాజాగా తన పేరు మార్చుకున్నారు.

Also Read: SL vs IND: సీఎస్‌కే తరఫున ఆడాకే గుర్తింపు వచ్చింది.. శ్రీలంక పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నేడు ఆకాశ్‌ పూరీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను పేరు మార్చుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇకపై తన పేరు ‘ఆకాశ్‌ పూరీ’ కాదని.. ‘ఆకాశ్‌ జగన్నాథ్‌ ‘అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఉన్నపళంగా ఆకాశ్‌ తన పేరు మార్చుకోవడానికి గల కారణంను మాత్రం చెప్పలేదు. కెరీర్‌ పరంగా ఆకాశ్‌ పూరీ కలిసి రావడం లేదనే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని నెటిజెన్స్ అంటున్నారు. ఏదేమైనా కొత్త పేరుతో అయినా ఓ హిట్స్ కొట్టాలని ఆశిస్తున్నారు.

 

Exit mobile version