NTV Telugu Site icon

Navdeep: నేడు ఈడీ విచారణకు హీరో నవదీప్… లావాదేవీలపై ఆరా తీయనున్న అధికారులు

Navadeep

Navadeep

Navdeep: డ్రగ్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తుంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈడీ అధికారులు 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. నేడు మరోసారి హీరో నవదీప్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా నవదీప్ విచారణకు హాజరుకాలేదు. ఇటీవల గుడిమల్కాపూర్ డ్రగ్ కేసులో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసులు విచారించారు.

Read Also:World Cup 2023: అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌.. హాస్పిటల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్!

నవదీప్‌కు నైజీరియన్‌ డ్రగ్స్‌ వ్యాపారులతో సంబంధాలున్నట్లు ఇటీవల పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నార్కోటిక్స్ పోలీసులు ఇప్పటికే బెంగళూరులో పలువురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నవదీప్ మొబైల్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లు, బ్యాంకు లావాదేవీలతో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై ఇవాళ ఈడీ అధికారులు ఆరా తీస్తారు. అయితే ఈడీ ఎదుట నవదీప్ హాజరవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నవదీప్ ను ప్రశ్నించే క్రమంలో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:NTPC Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..NTPCలో భారీగా ఉద్యోగాలు..

Show comments