పేరుకు కార్తీ కోలీవుడ్ హీరో అయినా టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడో మన హీరోగా ఓన్ చేసుకున్నారు. అతడిపై ఇక్కడి ప్రేక్షకులు లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడమే కాదు మార్కెట్ క్రియేట్ చేశారు. ఈ క్రేజే కార్తీపై టాలీవుడ్ దర్శకులు కాన్సట్రేషన్ చేసేలా చేసింది. ఒక్కరు కాదు ఆల్మోస్ట్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కార్తీ కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం స్వయంగా కార్తీనే రీసెంట్లీ అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో లీక్ చేశారు.
Also Read : This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
ఖుషీ తర్వాత ఖాళీగా ఉన్న శివ నిర్వాణ కార్తీకి ఓ కథ చెప్పాడు. కానీ వర్కౌట్ కాలేదు. అయితే కార్తీ కాదన్న కథనే రవితేజకు చెప్పి శివ నిర్వాణ ఓకే చేయించుకున్నాడు అనేది ఒక డౌట్ . అలాగే నితిన్‌తో రాబిన్ హుడ్ తీసి డిజాస్టర్ అందుకున్న వెంకీ కుడుముల ఓ స్క్రిప్ట్ చెబితే పడి పడి నవ్వుకున్నాడట కార్తీ. కానీ తన ఫ్యాన్స్ బాయ్‌గా వెంకీకి మరో స్టోరీని రెడీ చేసుకోమని ఆఫర్ చేశాడు స్టార్ హీరో. నానికి సరిపోదా శనివారంతో హిట్టిచ్చిన వివేక్ ఆత్రేయ కూడా రీసెంట్లీ కార్తీని మీట్ అయ్యాడు. అతడికి పైపైన స్టోరీ నేరెట్ చేయగా మరోసారి ఫుల్ స్క్రిప్ట్ వినబోతున్నాడట. కార్తీ కోసం ఈ దర్శకులంతా క్యూ కడితే తమిళ హీరో మాత్రం శైలేష్ కొలను స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాడు. హిట్3 ఎండింగ్‌లో ఎంటరై హిట్ 4కి లీడ్‌గా మారిన కార్తీ ఈ ప్రాజెక్ట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట కానీ ఇంకా టైం కావాలంటున్నాడు శైలేష్. ఇక్కడి హీరోలు కాదన్న కథలు తీసుకెళ్లి కార్తీకి చెబుతున్నారో ఆ హీరోకు నచ్చని స్టోరీలు మనవాళ్లకు చెప్పి ఓకే చేయించుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికి తమిళ హీరో కోసం మన దర్శకులైతే క్యూ కడుతున్నారు.
