Site icon NTV Telugu

Sandeep Raj Engagement: నటితో టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్‌మెంట్‌.. పిక్స్ వైరల్!

Sandeep Raj Chandini Rao

Sandeep Raj Chandini Rao

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటి చాందినీ రావుతో సందీప్‌ ఎంగేజ్‌మెంట్‌ సోమవారం గ్రాండ్‌గా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను సందీప్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. సందీప్‌-చాందిని ఎంగేజ్‌మెంట్‌ విశాఖపట్నంలో జరిగినట్టు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఈ జంట పెళ్లి జరగనున్నట్లు తెలిసింది.

సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్‌ చేసిన ఆయన ‘కలర్‌ ఫొటో’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. సుహాస్‌ హీరోగా రూపొందిన కలర్‌ ఫొటో ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ హీరోగా ‘మోగ్లీ’ సినిమాను సందీప్ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానునట్లు తెలుస్తోంది.

Also Read: Extramarital Affair: సొంత సోదరుడితో భార్య ఎఫైర్.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

సందీప్ రాజ్ డైరెక్టర్ చేసిన కలర్ ఫొటో సినిమా, హెడ్స్ అండ్ టేల్స్ వెబ్ సిరీస్‌లో చాందిని రావు నటించారు. కలర్‌ ఫొటో చిత్రీకరణ సమయంలోనే సందీప్, చాందినిలు ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారు. డిసెంబర్ 7న తిరుపతిలో ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన నెటిజన్లు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సందీప్‌-చాందినికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version