NTV Telugu Site icon

Anchor Lasya: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం!

Anchor Lasya

Anchor Lasya

Lasya Manjunath Father Dies: టాలీవుడ్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లాస్య భర్త ‘మంజునాథ్’ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

మంజునాథ్ తన తండ్రి మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకి కామెంట్ సెక్షన్ సైతం ఆఫ్ చేశారు. తండ్రితో దిగిన ఫొటోస్ మంజునాథ్ షేర్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు మంజునాథ్ కుటుంబంకు సంతాపం తెలుపుతున్నారు. 2017లో మంజునాథ్‌ను లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా లాస్య తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు.

Also Read: India Squad: తీవ్ర పోటీ.. అవకాశం ఎవరికి దక్కేనో! మే 1 కోసం ఫాన్స్ వెయిటింగ్

లాస్య గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ, ప్రాసలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఏనుగు, చీమ జోక్‌లతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. ఇక యాంకర్‌ రవితో లాస్య చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయి. బిగ్‌బాస్‌ రియాలిటీ షోలోనూ పాల్గొని.. మరింత క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.

Show comments