Varun Sandesh: టాలీవుడ్ యువ హీరోలలో ఒకరైన వరుణ్ సందేశ్ జూలై 21 (సోమవారం) తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది బర్త్‌డే వరుణ్‌కు మరపురాని గుర్తును మిగిలించింది భార్య వితికా షెరు. ఎందుకంటే, ఆయన భార్య ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి. మరి ఆ పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దామా..
Read Also:UP: హనీమూన్ మర్డర్ భయంతో ప్రియుడితో ఉండేందుకు భార్యకు అనుమతిచ్చిన భర్త
పుట్టినరోజు సందర్బంగా.. అనుకోని సర్ప్రైజ్‌గా భార్య నుంచి వచ్చిన బహుమతిని స్వయంగా వరుణ్ సందేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పోస్ట్ లో తన భార్య వితిక ఇచ్చిన బహుమతి ఒక కొత్త ఇల్లు అని తెలిపాడు. అవును, పుట్టినరోజు సందర్భంగా వితిక భర్త వరుణ్‌కు ఓ ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వరుణ్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
Read Also:Best Mileage Bikes: బడ్జెట్ ధరలో బెస్ట్ మైలేజ్ బైక్స్ ఇదిగో..!
“మీ పుట్టినరోజుకి భార్య ఇల్లు కొని ఇస్తే… అప్పుడు మీరెంత అదృష్టవంతుడో మీకే తెలుస్తుంది. ఇంకా ఊహించలేని, అబద్ధం అనిపించే సర్ప్రైజ్‌ని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది కేవలం ఓ గిఫ్ట్ మాత్రమే కాదు.. ఇది కొత్త జీవిత అధ్యాయానికి ఆరంభం. నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తూ.. నాకు మద్దతుగా నిలుస్తూ, ఇప్పుడు నా ఇంటి యజమానిగా మార్చినందుకు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. నా సూపర్ వుమన్‌ను ఎంతో ప్రేమతో ప్రేమిస్తున్నా..” అంటూ రాసుకొచ్చారు. వితికతో కలిసి వరుణ్ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన సినీ ప్రముఖులు, సినీ ప్రేక్షకులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
