ఇవాళ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫ్రీ హోల్డ్ భూములపై చర్చ.. రైతులకు కొత్త పాస్ బుక్స్, రెవెన్యూశాఖలో ఉన్న సమస్యలు, భూసంస్కరణలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్న సీఎం
నేడు మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. రూ.1290 కోట్ల రూపాయలతో పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం శంకుస్థాపనలో పాల్గొననున్న పవన్
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
నేడు జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
ఈరోజు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.. “విశాఖ ఉక్కు ప్రస్తుత పరిస్థితి” అనే అంశంపై సమావేశం.. పాల్గొనున్న చలసాని శ్రీనివాస్, వివి లక్ష్మీనారాయణ
నేడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి.. రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
పెదవేగి మండలం కొండలరావుపాలెంలో “రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో” కార్యక్రమం.. హాజరుకానున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
నేడు శ్రీశైలంలో శుక్రవారం సందర్భంగా శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజలు
నేడు సిగాచి పరిశ్రమ వద్దకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఘటన స్థలాన్ని పరిశీలించనున్న నేతలు
రాజన్నసిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన.. మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లోని నూతన భవనాలకి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనున్న బండి సంజయ్
వరంగల్లో వైభవంగా కొనసాగుతున్న భద్రకాళి అమ్మవారి శాకాంభరీనవరాత్రి మహోత్సవాలు.. 9వ రోజు కు చేరిన భద్రకాళి అమ్మవారి శాకాంభరీనవరాత్రి వేడుకలు.. నేటి ఉదయం దీప్తాక్రమం, సాయంత్రం కులసుందరీక్రమం అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు
నేడు బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ కోసం అర్హత సాధించిన విద్యార్థుల లిస్టును విడుదల చేయనున్న అధికారులు.. ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రొవిజినల్ సెలెక్టెడ్ లిస్టు విడుదల చేయనున్న వీసీ
నేడు నితిన్ ‘తమ్ముడు’, నవీన్ చంద్ర ‘షో టైమ్’ సినిమాలు రిలీజ్ కానున్నాయి
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టెస్టు.. నేడు కొనసాగనున్న మూడో రోజు ఆట
