ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లకు ఆమోదం తెల్పనున్న కేబినెట్
ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఏపీ సీఈఓ సమావేశం.. ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ.. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చించే అవకాశం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి.. అమ్మవారికి బోనాలు సమర్పించనున్న భక్తులు
నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4వ రోజుకు చేరుకున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్.. ఇవాళ రాజమండ్రి రానున్న
మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు .. ఇవాళ సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న కుటుంబ సభ్యులు
ఇవాళ ఆన్ లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన టీటీడీ దర్శనం టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి గ్రామంలో హైడ్రోపవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులతో బహిరంగ సభ.. హాజరుకానున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనువాసురావు, కేంద్రకమిటీ సభ్యుడు లోకనాథం
కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసం ఉత్సవాలు.. నెల రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలు.. సాయంత్రం స్వామి వారికి తులసి అర్చన, బిల్వార్చన, పుష్పర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం వంటి విశేష పూజలు
నేటి నుంచి 5 రోజుల పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు
ఈరోజు ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
నేడు నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య నాలుగో టెస్టు.. నేడు కొనసాగనున్న రెండో రోజు
పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు నేడు రిలీజ్.. థియేటర్స్ వద్ద పవన్ ఫాన్స్ హంగామా
