NTV Telugu Site icon

Today (15-03-23) Stock Market Roundup: 17 వేల దిగువకి నిఫ్టీ50

Today(15 03 23) Stock Market Roundup

Today(15 03 23) Stock Market Roundup

Today(15-03-23) Stock Market Roundup: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఈ వారం వరుసగా 3 రోజుల నుంచి ఒకే రకమైన ట్రేడింగ్‌ వాతావరణం నెలకొంది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభం కావటం.. మధ్యాహ్నానికి డీలా పడిపోవటం.. ఇదే జరుగుతోంది. ఇవాళ బుధవారం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌ స్టాక్స్‌ మరియు రిలయెన్స్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు బలహీనపడటంతో సెన్సెక్స్‌, నిఫ్టీ రోజురోజుకీ నేలచూపులు చూస్తున్నాయి. సెన్సెక్స్‌ 344 పాయింట్లు కోల్పోయి 57 వేల 555 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్లు తగ్గి 16 వేల 972 వద్ద క్లోజ్‌ అయింది.

Oil giant Saudi Aramco: కనీవినీ ఎరగని రీతిలో లాభాలను సొంతం చేసుకున్న సంస్థ

సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 9 కంపెనీలు మాత్రమే మంచి పనితీరు కనబరిచాయి. మిగతా 21 కంపెనీలు వెనకబడ్డాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో.. స్వాన్‌ ఎనర్జీ, స్పార్క్‌, బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ భారీగా దెబ్బతిన్నాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ 6 శాతం, వరుణ్‌ బేవరేజెస్‌ 5 శాతం, మారుతీ సుజుకీ 2 శాతం రాణించాయి.

ఎన్‌బీసీసీ ఇండియా షేర్లు 3 శాతానికి పైగా ర్యాలీ తీశాయి. రంగాల వారీగా చూస్తే.. మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతం పెరిగింది. మిగతా సూచీలు అంచనాలను అందుకోలేకపోయాయి. బ్రాడర్‌ ఇండెక్స్‌లు సున్నా పాయింట్‌ 5 శాతం వరకు లాభపడ్డాయి. అయితే.. వోలటాలిటీ ఇండెక్స్‌, ఇండియా వోలటాలిటీ ఇండెక్స్‌ 5 శాతం పడిపోయాయి.

10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 86 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 57 వేల 397 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు 238 రూపాయలు పడిపోయింది. అత్యధికంగా 66 వేల 718 రూపాయలు పలికింది.

క్రూడాయిల్‌ ధర స్వల్పంగా 38 పైసలు మైనస్‌ అయింది. ఒక బ్యారెల్‌ ముడిచమురు 5 వేల 945 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 14 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 62 పైసల వద్ద స్థిరపడింది.