Today Top Trending Google Viral Video: నిన్నటి వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బస్సుల్లో సీట్ల కోసం ఆడవాళ్లు కొట్టుకోవడం మనం చూశాం. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్‌లో కూడా సీట్ కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం కనిపిస్తుంది. మెట్రో ఒక స్టేషన్‌లో ఆగిపోయింది. ఈ వీడియోను చూసిన వారంతా.. ఇది ఢిల్లీ మెట్రో ఫైట్‌గా అభివర్ణించారు. మరికొందరు ఏకంగా డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్‌తో పోలుస్తున్నారు.
వివారాల్లోకి వెలితే.. మెట్రో రైలులో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి.. జుట్టు, జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు వచ్చింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఒక స్త్రీ సీటుపై పడిపోగా.. మరో స్త్రీ పైనుంచి కొట్టసాగింది. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని లాగుతూనే ఉన్నారు. అక్కడే ఉన్న మరో మహిళ వారిని ఆపేందుకు ప్రయత్నించింది. అయినప్పటికి ఆమె ప్రయత్నం విఫలమైంది.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్.. కానీ..!
ఈ మహిళలు కొట్టుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వాళ్లంతా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే దీనిని ఢిల్లీ మెట్రో యుద్ధంగా వర్ణించారు. కొందరు ఈ పోరాటాన్ని రెజ్లింగ్ మైదానంతో ముడిపెడుతుండగా.. మరికొందరు దీనిని డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్‌తో పోలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా పురుషులు ఎవ్వరూ వారిని ఆపేందుకు ప్రయత్నించకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.
Kalesh between two ladies inside kaleshi Delhi Metro over seat issues pic.twitter.com/tny8m7TSIx
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025
