NTV Telugu Site icon

Today Stock Market Roundup 28-04-23: బెంచ్ మార్క్‌లను బ్రేక్ చేసి.. సెన్సెక్స్ 61 వేలు, నిఫ్టీ 18 వేలు

Today Stock Market Roundup 28 04 23

Today Stock Market Roundup 28 04 23

Today Stock Market Roundup 28-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని అద్భుతమైన ఫలితాలతో ముగించింది. చివరి రోజైన ఇవాళ శుక్రవారం రెండు కీలక సూచీలు అనూహ్యంగా అత్యధిక విలువలను అందుకోవటం విశేషం. విదేశీ మరియు స్వదేశీ కొనుగోళ్లు కలిసొచ్చాయి. రిలయెన్స్, ఐటీసీ, కొటక్, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థలు రాణించాయి. నిఫ్టీ రెండు నెలల తర్వాత తన బెంచ్ మార్క్‌ని దాటడం చెప్పుకోదగ్గ విషయం.

Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..

ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత 18 వేల మార్క్‌ను బ్రేక్ చేయటం ఇదే మొదటిసారి. దీంతో.. సెన్సెక్స్.. చివరికి 463 పాయింట్లు పెరిగి 61 వేల 112 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 149 పాయింట్లు పెరిగి 18 వేల 65 పాయింట్ల వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 22 కంపెనీలు మెరవగా 8 కంపెనీలు మాత్రమే వెనకబడ్డాయి.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మంచి పనితీరు కనబరిచిన సంస్థల జాబితాలో అదానీ గ్రూపు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ముందు వరుసలో నిలిచాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. విప్రో సంస్థ స్టాక్ వ్యాల్యూ 3 శాతం పెరిగింది. ఈ కంపెనీ 12 వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించటం ప్లస్ పాయింట్ అయింది. ఎల్ అండ్ టీ సంస్థ షేర్ విలువ రెండు శాతం లాభపడింది. మరో వైపు యాక్సిస్ బ్యాంక్ స్టాక్ వ్యాల్యూ 3 శాతం డౌన్ అయింది.

10 గ్రాముల బంగారం ధర 131 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 59 వేల 770 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 75 రూపాయలు మాత్రమే పడిపోయింది. అత్యధికంగా 73 వేల 899 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర అతి స్వల్పంగా పది రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 150 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 5 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 81 రూపాయల 76 పైసల వద్ద స్థిరపడింది.