Today Stock Market Roundup 27-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఉదయం మందకొడిగా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం చెప్పుకోదగ్గ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూచీలు క్రమంగా పెరిగాయి. బాగా రాణించిన సంస్థల జాబితాలో బజాజ్ ట్విన్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో ముందు వరుసలో నిలిచాయి.
మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బజాజ్ ఫైనాన్స్ సంస్థ క్యూ4లో మంచి పనితీరు కనబరచటం కలిసొచ్చింది. ఆ కంపెనీ షేర్ల విలువ 3 శాతం పెరిగింది. ఎల్‌టీటీఎస్ స్టాక్ వ్యాల్యూ కూడా 4 శాతం ర్యాలీ తీసింది. కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ పెరగటం ప్లస్ పాయింట్ అయింది.
read more: Land Rates in Hyderabad: హైదరాబాద్‌లో భూముల రేట్లు.. యావరేజ్‌గా గజం స్థలం ఎంతుందంటే?..
రంగాల వారీగా చూసుకుంటే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ మరియు రియాల్టీ ఇండెక్స్‌లు సున్నా పాయింట్ మూడు శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు.. నిఫ్టీ మీడియా సూచీ సున్నా పాయింట్ 2 శాతం పడిపోయింది. సెన్సెక్స్ 348 పాయింట్లు పెరిగి 60 వేల 649 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 17 వేల 915 వద్ద ఎండ్ అయింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 సంస్థల్లో ఏకంగా 24 సంస్థలు మెరిశాయి. ఆరు సంస్థలు మాత్రమే చతికిలపడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 50 కంపెనీల్లో 15 కంపెనీలు మాత్రమే లాభాల బాట పట్టాయి. మిగతావి వెనకబడ్డాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ చేపట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి మూడో రోజు, చివరి రోజైన ఇవాళ మధ్యాహ్నం మూడున్నర వరకు 14 పాయింట్ ఒకటీ ఐదు శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్ లభించింది.
10 గ్రాముల బంగారం ధర 304 రూపాయలు పెరిగింది. తద్వారా 60 వేల 197 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 587 రూపాయలు పెరిగింది. ఫలితంగా 74 వేల 406 రూపాయల గరిష్ట విలువ పలికింది. క్రూడాయిల్ ధర 128 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 107 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 84 పైసల వద్ద స్థిరపడింది.