NTV Telugu Site icon

Today Stock Market Roundup 20-03-23: మార్కెట్‌కి ‘ఉక్రెయిన్‌’ ఊరట

Today Stock Market Roundup 20 03 23

Today Stock Market Roundup 20 03 23

Today Stock Market Roundup 20-03-23: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. మొదటి రోజైన ఇవాళ సోమవారం ఆద్యంతం నెగెటివ్‌ జోన్‌లోనే ట్రేడింగ్‌ జరిగింది. ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో మొదలై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఎంపిక చేసిన బ్యాంక్‌ స్టాక్స్‌తోపాటు ఎఫ్‌ఎంసీజీ రంగంలో చివరి నిమిషంలో జరిగిన కొనుగోళ్లు ఇంట్రాడేలో వచ్చిన నష్టాలను కాస్త పూడ్చగలిగాయి.

ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నిలిపేసే ప్రతిపాదన వార్తలు కూడా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు మెరుగైన ఫలితాలను నమోదుచేయటానికి ఉపయోగపడ్డాయి. క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ అవి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ని పూర్తిస్థాయిలో పెంచలేకపోయాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒక శాతం చొప్పున డౌన్‌ అయ్యాయి. చివరికి.. సెన్సెక్స్‌.. 360 పాయింట్లు కోల్పోయి 57 వేల 628 పాయింట్ల వద్ద ఎండ్‌ అయింది.

read more: India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్‌బస్‌ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం

నిఫ్టీ.. 111 పాయింట్లు తగ్గి 16 వేల 988 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 25 కంపెనీలు లాభాల బాటలో నడవగా 5 కంపెనీలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. రాణించినవాటిలో హెచ్‌యూఎల్‌, ఐటీసీ, కొటక్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, నెస్లే ఇండియా ఉండగా వెనకబడ్డ సంస్థల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులతోపాటు ఏసియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ తదితర కంపెలు ఉన్నాయి.

నిఫ్టీలో హెచ్‌యూఎల్‌ మరియు బీపీసీఎల్‌ షేర్ల విలువలు 2 శాతానికి పైగా పెరిగాయి. బజాజ్‌ ట్వాన్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, మెటల్‌ స్టాక్స్‌ నేలచూపులు చూశాయి. 10 గ్రాముల బంగారం రేట్‌ 432 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 59 వేల 815 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి ధర 596 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 69 వేల 97 రూపాయలు పలికింది.

క్రూడాయిల్‌ రేట్‌ 193 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్‌ ముడి చమురు 5 వేల 336 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 2 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 61 పైసల వద్ద స్థిరపడింది.