NTV Telugu Site icon

Telangana Weather: కూల్‌ కూల్‌ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..

Telangana Weather

Telangana Weather

Telangana Weather: హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. అందువలన ఇది మరాఠ్వాడా నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

Read also: Minister RK Roja: నగరిలో అసంతృప్తి సెగలు..! మంత్రి రోజా రాకముందే ప్రారంభోత్సవాలు..

జంటనగరాల్లో సాయంత్రంలోగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక..రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 0.5 నుంచి 31.8 మి.మీ వరకు వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లలో 16.8, రంగారెడ్డిలో 15.7, నారాయణ పేటలో 15 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.

Read also: PM Modi: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. రూ.169 కోట్లతో తెలంగాణలో 15..!

మరోవైపు ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో పగటిపూట మంచు ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఎర్రటి ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Minister RK Roja: నగరిలో అసంతృప్తి సెగలు..! మంత్రి రోజా రాకముందే ప్రారంభోత్సవాలు..