Telangana Weather: కూల్ కూల్ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Weather: హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. అందువలన ఇది మరాఠ్వాడా నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
Read also: Minister RK Roja: నగరిలో అసంతృప్తి సెగలు..! మంత్రి రోజా రాకముందే ప్రారంభోత్సవాలు..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
జంటనగరాల్లో సాయంత్రంలోగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక..రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 0.5 నుంచి 31.8 మి.మీ వరకు వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లలో 16.8, రంగారెడ్డిలో 15.7, నారాయణ పేటలో 15 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.
Read also: PM Modi: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. రూ.169 కోట్లతో తెలంగాణలో 15..!
మరోవైపు ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో పగటిపూట మంచు ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఎర్రటి ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Minister RK Roja: నగరిలో అసంతృప్తి సెగలు..! మంత్రి రోజా రాకముందే ప్రారంభోత్సవాలు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!