Site icon NTV Telugu

Gold Rate Today: ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి

Gold

Gold

బంగారం, వెండి ధరలు మోత మోగిస్తున్నాయి. రోజురోజుకు అంతకంతకు పెరుగుతూ షాకిస్తు్న్నాయి. ఇవాళ మరోసారి పుత్తడి ధరలు భగ్గుమన్నాయి. తులం పసిడిపై రూ. 550 పెరిగింది. బంగారం బాటలోనే వెండి పయనించింది. నేడు కిలో వెండిపై ఏకంగా రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,426, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,390 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగింది. దీంతో రూ.1,13,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగింది.

Also Read:Prabhas Fauji Release Date: అదిరిపోయే అప్‌డేట్.. ప్రభాస్ మరో సినిమా రిలీజ్ డేట్ లాక్?

దీంతో రూ. 1,24,260 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,410 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,87,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,77,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version