NTV Telugu Site icon

Pawan Kalyan: నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో..

Pawan

Pawan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా నేడు (ఆదివారం) అనకాపల్లికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3. 30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్‌ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రింగ్‌ రోడ్డులో గల ఎన్టీఆర్‌ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్‌, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్‌ జంక్షన్‌ వరకూ వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ రోడ్డు షో చేస్తారు. నాలుగు గంటలకు నెహ్రూ చౌక్‌ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లడనున్నారు.

Read Also: RCB vs RR: ఆర్సీబీ మరో ఓటమి.. కోహ్లీ శ్రమ వృథా

ఇక, అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు సపోర్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. అయితే, ఈ రోడ్ షోలో అనకాపల్లి సహా పలు సమస్యలపై జనసేనాని చీప్ మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే, తన రాజకీయ ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త్వరలో అనకాపల్లిలో పర్యటించే అవకాశం కూడా ఉంది.

Show comments