Site icon NTV Telugu

NEET Exam 2024: నేడు నీట్ పరీక్ష.. క్షణం ఆలస్యమైన నో ఎంట్రీ..

Neet

Neet

Neet UG 2024 Exam: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు (మే 5న) నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 23, 81, 833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్, పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Read Also: Kamakshi Bhaskarla : మరో ఇంట్రెస్టింగ్ ఆఫర్ కొట్టేసిన “పొలిమేర” హీరోయిన్..

కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. సుమారు 5, 402 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ఎక్సామ్ కొనసాగనుంది. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అని అధికారులు చెప్పారు. ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ వెంట తీసుకెళ్ళాలి.. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు అని అధికారులు చెప్పుకొచ్చారు.

Read Also: Kareena Kapoor: యునిసెఫ్‌ ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌గా కరీనా కపూర్‌ నియామకం

విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రీస్కింగ్ నిర్వహిస్తారు. షూస్ తో పాటు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు.. విద్యార్థినిలు ఆభరణాలు ధరించకూడదు.. మెహేంది కూడా పెట్టుకోని రాకూడదు.. సంప్రదాయ దుస్తులు వేసుకొని రావాల్సి ఉంటుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఎన్టీఏసీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి గదిలో నిఘా నేత్రాల నడుమ పరీక్ష నిర్వహణ.. సెల్ ఫోన్లు పని చేయకుండా పరీక్షా కేంద్రాల్లో జామర్లను అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version