Site icon NTV Telugu

Nitish Kumar: నేడు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా..?

Nithesh

Nithesh

బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ నితీశ్ కుమార్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఇప్పటి వరకూ ఉన్న ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి.. కొత్త సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నం చేయనున్నారు. ఇందులో భాగంగా నేడు ఆర్జేడీ శాసనసభా పక్ష సమావేశం జరగబోతుంది. అందులో తమ నేతగా నితీశ్ కుమార్‌ను ఎన్నుకోవడంతో పాటు తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా.. గవర్నర్‌ని కోరనున్నారు. రేపు (ఆదివారం) నితీశ్ కుమార్ సీఎంగా, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉంది.

Read Also: Monkey Man : ఆకట్టుకుంటున్న ‘మంకీ మ్యాన్’ ట్రైలర్..

ఇక, ఇండియా కూటమి నుంచి తప్పుకున్న జేడీయూ.. బీజేపీతో కలిసేందుకు ఎదురు చూస్తుంది. అయితే, కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చినట్లు టాక్. కీలకమైన తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ ఇండియా కూటమి నుంచి వైదొగలడంతో ఆ కూటమి చాలా బలహీనంగా మారిపోయింది. దాంతో తిరిగి అధికారంలోకి రాగలం అనే కాంగ్రెస్ పార్టీ ఆశలు గల్లంతు అయ్యాయి.

Read Also: OU Registrar: మరోసారి జరగదు.. విద్యార్థినుల రక్షణ మాదే.. ఓయూ రిజిస్టార్ క్లారిటీ

ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ లాంటి వాళ్లు తామే ప్రధాని అభ్యర్థి కావాలని ట్రై చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఆ కూటమిలో తీవ్ర చిచ్చు పెట్టింది. ఇక, 2022లో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Exit mobile version