Site icon NTV Telugu

Mahapanchayat: నేడు ఢిల్లీలో “మహాపంచాయత్”.. నెల రోజుల ఆందోళన తర్వాత హస్తినకు రైతులు..

Kisan

Kisan

Kisan Mazdoor Mahapanchayat: నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ ( Kisan Mazdoor ) మహాపంచాయత్‌ ( Mahapanchayat ) ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో జరగబోతుంది. ఈ మహా పంచాయత్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులు, రైతు కూలీలు, గ్రామస్థులు నిన్న (బుధవారం) సాయంత్రానికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, మహాపంచాయతీ జరిగే ప్రాంతంలో సన్నాహాలు పూర్తి అయ్యాయి.

Read Also: Health Tips : ఖాళీ కడుపుతో యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ఇక, నిన్న సాయంత్రానికే పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ లాంటి రాష్ట్రాల నుంచి వందలాది టాక్టర్లు, ట్రాలీలు ఢిల్లీకి చేరుకున్నాయి. అలాగే, రైళ్లలో కూడా వేలాది మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్‌కేఎంకు చెందిన ఆయా సమన్వయ కమిటీలు, సబ్‌కమిటీలు బుధవారం నాడు సమావేశమై అన్ని సన్నాహాక ఏర్పాట్లను పూర్తి చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజాస్వామిక సంఘాల లాంటి ఎస్‌కేఎం సమన్వయ సంఘాలతో సహా దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజల సైతం ఈ చారిత్రాత్మక మహాపంచాయత్‌ని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా విజ్ఞప్తి చేసింది. దీంతో అన్ని సంఘాలకు చెందిన వారు ఢిల్లీకి చేరుకుంటున్నారు.

Exit mobile version