తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. నేడు విజయదశమి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు, రిమాండ్ ఖైదీల కుటుంబ సభ్యులు సహకరించాలని జైలు అధికారులు కోరారు. అయితే, మరోవైపు.. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టై ఇవాళ్టికి 46వ రోజుకు చేరింది. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబు గత నెల 9వ తేదీన అరెస్ట్ అయ్యారు. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు గడువును పొడిగించింది.
Read Also: Balayya: అన్ని సెంటర్స్ లో భగవంత్ కేసరి మాస్ బ్యాటింగ్
అయితే, చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు బీపీ సాధారణంగానే ఉండగా, ఫిజికల్ యాక్టివిటీ బాగున్నట్లు రాజమండ్రి జైలు అధికారులు వెల్లడించారు. నిమిషానికి 12 సార్లు శ్వాస తీసుకుంటుండగా, నిమిషానికి 62 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఊపిరితిత్తులకు ఏ సమస్యా లేదని చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారని డాక్టర్ల టీమ్ జైలు అధికారులకు వెల్లడించారు.