Gold Price Today: కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా పెరుగుతున్న ధరలు కాస్తంత తిరోగమనం చెందాయి. ఇటీవల గోల్డ్, సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఏకంగా 7నెలల గరిష్టానికి చేరాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడంతో డాలర్ విలువ పడిపోయింది. దీంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తర్వాత మళ్లీ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు మరోసారి పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు మళ్లీ పడిపోయాయి. వరుసగా వారం రోజులు గోల్డ్ రేట్ పడిపోయింది. అయితే నిన్న మాత్రం మరోసారి ధర పెరిగింది.
Read Also : Delivery Boy Kiss woman : డెలివరీ ఇచ్చాడు.. ముద్దు పెట్టాడు.. ఆ డెలివరీ బాయ్‌ని ఆమె ఏం చేసిందంటే
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 వద్ద కొనసాగుతోంది. అది అంతకు ముందుతో పోల్చుకుంటే రూ.300 పెరిగింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.52,970 వద్ద ఉంది. అక్టోబర్‌లో బంగారం గరిష్టంగా రూ.47,850 వద్ద నమోదు చేసింది. ప్రస్తుతం రేటు అంతకంటే ఎక్కువ ఉంది. బంగారం ధర స్థిరంగా ఉన్నా.. వెండి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 200 మేర తగ్గింది. దీంతో వెండి ధర రూ.68 వేలకు పడిపోయింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ ధర ఔన్సుకు 1754 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్సుకు 21.46 డాలర్ల వద్ద నమోదైంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతానికి రూ.81.81 వద్ద ట్రేడవుతోంది.