మన దేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 43, 500 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 47, 460 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా అదే దారి పట్టాయి. కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ. 64,600 పలుకుతుంది.
మహిళలకు షాక్ : పెరిగిన బంగారం ధరలు
