Today Gold Rates: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. అయితే, తార స్థాయికి చేరుకున్న ధరలు ఎట్టకేలకు కొద్దిమేర దిగొస్తున్నాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం నాడు మళ్లీ తగ్గింది. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక తులం పై రూ. 150 తగ్గింది.
Also Read: Bhubharati Bill: భూ-భారతి బిల్లు ప్రధానాంశాలు, ప్రత్యేకతలు ఇవే..
మరోవైపు, వెండి ధర మాత్రం భారీగా తగ్గిన వెండి.. రెండు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే బుధవారం కూడా వెండి ధరలలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ. 92,500గా ఉండగా. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు తమిళనాడు, కేరళలలో కూడా ఒక కేజీ వెండి ధర ఒక లక్షగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో మాత్రమే కిలో వెండి రూ.92,500గా ఉండగా.. వివిధ ప్రధాన నగరాలలో వేరు వేరు ధరలతో అమ్మకాలు జరుగుతున్నాయి.
Also Read: Star Boy : ప్రభాస్ సినిమాను ఢీ కొట్టనున్న సిద్దు జొన్నలగడ్డ