Today’s Gold and Silver Rates in Hyderabad on 2024 March 21: బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడగా.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. నేడు అందరూ షాక్ అయ్యాయేలా తులం బంగారంపై ఏకంగా రూ.1000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (మార్చి 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,420గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.1000.. 24 క్యారెట్ల బంగారంపై రూ.1090 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,950గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,570గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,800 కాగా.. 24 క్యారెట్ల 10 ధర రూ.67,420గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.62,350.. 24 క్యారెట్ల ధర రూ.68,020గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,800 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.67,420గా నమోదైంది.
నేడు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కిలో వెండిపై రూ.1500 పెరిగి.. రూ.78,500లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,500 ఉండగా.. ముంబైలో రూ.78,500గా ఉంది. చెన్నైలో రూ.81,500లుగా నమోదవగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,500లుగా ఉంది. కిలో వెండి ధర అత్యల్పంగా బెంగళూరులో రూ.76,000గా ఉంది.
Also Read: Off The Record : ఏపీలో బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదా..?