NTV Telugu Site icon

Gold Rate Today : పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర

Gold And Silver

Gold And Silver

Gold Rate Today : నిన్న మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. వెండి రేటు కూడా బంగారం బాటలో పయనించింది. ఇది బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. ధంతేరాస్, దీపావళి పండుగ ముందు బంగారం ధరలు భారీగా పెరగడం ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా ధంతేరాస్ రోజు చాలా మంది బంగారం కొంటుంటారు. ఇలా చేయడం శుభప్రదం అని భావిస్తారు. కొంత కాలంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అలాగే పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగొచ్చనే అంచనాలు. ఇలా ఈ రెండు అంశాల కారణంగా బంగారం ధరలు పైకి చేరాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు ర్యాలీ చేశాయి. భారీగా పెరిగాయి. ఈ ప్రభావం వల్ల కూడా దేశంలో బంగారం ధరలు పరుగులు పెట్టాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also: Dussehra: ‘దసరా’కు ‘పుష్ప’ జ్ఞాపకాలు.. సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఔన్స్‌కు 1.57 శాతం పెరిగింది. 1662 డాలర్లకు ఎగసింది. అలాగే వెండి రేటు 3.8 శాతం పెరిగి.. 19.4 డాలర్లకు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో అక్టోబర్ 22 శనివారం రోజున బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 830 పైకి చేరింది. దీంతో పసిడి రేటు పది గ్రాములకు రూ. 51,280 స్థాయికి ఎగసింది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ రేటు 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. దీని రేటు రూ. 750 పెరిగింది. దీంతో బంగారం రేటు పది గ్రాములకు రూ. 47 వేలకు చేరింది. ఇక వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పెరిగింది. సిల్వర్ రేటు రూ. 1700 మేర పైకి చేరింది. దీంతో కేజి వెండి రేటు రూ. 63,200కు చేరింది. కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అదనం. ఇంకా జువెలరీ తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కూడా ఉంటాయి. అందువల్ల ఇవ్వన్నీ కలుపకుంటే.. బంగారం ధరలో వ్యత్యాసం ఉండొచ్చు.

Show comments