Gold Rate Today : పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today : నిన్న మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. వెండి రేటు కూడా బంగారం బాటలో పయనించింది. ఇది బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. ధంతేరాస్, దీపావళి పండుగ ముందు బంగారం ధరలు భారీగా పెరగడం ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా ధంతేరాస్ రోజు చాలా మంది బంగారం కొంటుంటారు. ఇలా చేయడం శుభప్రదం అని భావిస్తారు. కొంత కాలంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అలాగే పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగొచ్చనే అంచనాలు. ఇలా ఈ రెండు అంశాల కారణంగా బంగారం ధరలు పైకి చేరాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు ర్యాలీ చేశాయి. భారీగా పెరిగాయి. ఈ ప్రభావం వల్ల కూడా దేశంలో బంగారం ధరలు పరుగులు పెట్టాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also: Dussehra: ‘దసరా’కు ‘పుష్ప’ జ్ఞాపకాలు.. సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఔన్స్‌కు 1.57 శాతం పెరిగింది. 1662 డాలర్లకు ఎగసింది. అలాగే వెండి రేటు 3.8 శాతం పెరిగి.. 19.4 డాలర్లకు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో అక్టోబర్ 22 శనివారం రోజున బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 830 పైకి చేరింది. దీంతో పసిడి రేటు పది గ్రాములకు రూ. 51,280 స్థాయికి ఎగసింది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ రేటు 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. దీని రేటు రూ. 750 పెరిగింది. దీంతో బంగారం రేటు పది గ్రాములకు రూ. 47 వేలకు చేరింది. ఇక వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పెరిగింది. సిల్వర్ రేటు రూ. 1700 మేర పైకి చేరింది. దీంతో కేజి వెండి రేటు రూ. 63,200కు చేరింది. కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అదనం. ఇంకా జువెలరీ తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కూడా ఉంటాయి. అందువల్ల ఇవ్వన్నీ కలుపకుంటే.. బంగారం ధరలో వ్యత్యాసం ఉండొచ్చు.
- Tags
- Gold
- hyderabad
- Rate Today
- Silver
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!