హోళీ పండగ వేళ గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి పెరిగిన బంగారం ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. అంతకంతకు పెరుగుతూ అందని ద్రాక్షలా మారుతోంది బంగారం. నేడు తులం గోల్డ్ ధర ఏకంగా రూ. 1200 పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగులుతోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Mining Mafia: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా.. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు..!
హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,978, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,230 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1100 పెరగడంతో రూ. 82,300 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరగడంతో రూ. 89,780 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 89,930 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Diabetes Tablets: డయాబెటిస్ మందుల ధరలో భారీ తగ్గింపు.. రూ. 60 నుంచి రూ. 5కి తగ్గిన ట్యాబ్లెట్ ధరలు
పసిడితో పాటు సిల్వర్ ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా రూ. 2000 పెరిగింది. పెరుగుతున్న ధరలతో సిల్వర్ కూడా బంగారమైపోతోంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 2 వేలు పెరగడంతో రూ. 1,12,000 వద్ద అమ్ముడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,03,000 వద్దకు చేరింది.