Site icon NTV Telugu

Gold Rates: గోల్డ్ ధరలు ఢమాల్.. ఒక్కరోజె రూ. 930 తగ్గిన తులం బంగారం ధర

Gold Rate Today

Gold Rate Today

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. యుద్ధం ముగియడంతో, మార్కెట్లో స్థిరత్వం తిరిగి వచ్చింది. నేడు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే తులం బంగారం ధర రూ. 930 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,802, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,985 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 850 తగ్గింది. దీంతో రూ.89,850 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 930 తగ్గింది. దీంతో రూ. 98,020 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read:Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్రలో బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు..?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,000 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,170 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,17,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,07,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version