Site icon NTV Telugu

Gold Rates: హమ్మయ్య.. దిగొచ్చిన గోల్డ్ ధరలు.. రూ. 2 వేలు పెరిగిన సిల్వర్ ధరలు

Silver

Silver

బంగారం ధరలు తగ్గి ఊరటనివ్వగా.. సిల్వర్ ధరలు పెరిగి షాకిచ్చాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,977, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,145 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.91,450 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో రూ. 99,770 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:Tejeswar Murder case: మహానటి.. ప్రియుడి మోజులో భర్తను చంపి.. కంట్లో గ్లిజరిన్‌ వేసుకుని దొంగ ఏడుపు

విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,600 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,920 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు షాకిచ్చాయి. కిలో వెండిపై ఏకంగా రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,27,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 4000 పెరగడంతో రూ. 1,19,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version