Site icon NTV Telugu

Gold And Silver Prices: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..!

Gold

Gold

అంతర్జాతీయం, జాతీయంగా బంగారం ధరలు తగ్గాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్‌ వడ్డీ రేటు పెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగొచ్చాయి. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. మరోవైపు 25 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు దూసుకుపోతోందన్న ఆందోళన మొదలైంది. దీంతో అమెరికా కరెన్సీ డాలరు కూడా నష్టాల బాట పట్టింది.

Minister Jogi Ramesh: సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయి

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి కొద్దిగా పుంజుకోగా.. ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,565 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కూడా రూ.128 పెరిగి కిలోకు రూ.73,875 వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు వోలటైల్‌గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.3శాతం పెరిగి ఔన్స్‌కు 1,951.19 డాలర్లు ఉంది. అంతకుముందు జూలై 12న కనిష్ట స్థాయిని తాకగా.. మునుపటి సెషన్‌లో 1.4 శాతం క్షీణించింది. ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 0.4శాతం పతనమైంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 1,950 డాలర్ల వద్దకు చేరింది.

Hindu Boy Thrashed: నుదుటిపై తిలకం పెట్టుకున్నాడని హిందూ విద్యార్థిపై దాడి

ఇక హైదరాబాదులో బంగారం, వెండి ధరల విషయానికొస్తే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 350 రూపాయలు తగ్గగా.. ధర రూ. 55,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 380 పతనమై రూ. 60,110 గా ఉంది. వెండి ధర కూడా భారీగా దిగి వచ్చి 80 వేల దిగువకు చేరింది. ఇంతకుముందు వెండి ధర భారీగా పెరగగా.. శుక్రవారం ఏకంగా 2 వేల రూపాయలు పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 79,500 గాఉంది.

Exit mobile version