శ్రావణ మాసం వేళ శుభకార్యాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరలు దడ పుట్టిస్తుండగా నేడు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,993, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,160 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Venkaiah Naidu: వీఐపీలు ఏడాదికి ఒక్కసారే శ్రీవారి దర్శనానికి రావాలి..!
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,080 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
