Site icon NTV Telugu

Gold Rates: ఓరి దేవుడా.. బంగారం కొనేదెట్టా.. ఒక్కరోజే రూ. 1600 పెరిగిన గోల్డ్ ధర

Goldrates

Goldrates

బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మరోసారి భారీగా పెరిగి షాకిచ్చాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 1640 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,495, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,620 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1500 పెరిగింది. దీంతో రూ.96,200 వద్ద అమ్ముడవుతోంది.

Also Read:Saroor Nagar Husband M*urder case: సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డంబెల్స్ తో మోది..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1640 పెరిగింది. దీంతో రూ. 1,04,950 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96,350 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,100 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,31,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,21,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version