పుత్తడి ధరల్లో నేడు మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు భారీగా పెరిగి షాకివ్వగా.. నేడు స్వల్పంగా పెరిగి ఊరటనిచ్చాయి. తులంపై జస్ట్ రూ. 10 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,261, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,406 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. దీంతో రూ.94,060 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:Survey Predicts: లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. వెలుగులోకి షాకింగ్ సర్వే
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. దీంతో రూ. 1,02,610 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,210 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,760 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,29,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,19,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
