పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతూ షాకిస్తున్నాయి. ఇవాళ మళ్లీ భారీగా గోల్డ్ ధరలు పెరిగాయి. తులం బంగారం ధర రూ. 380 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,244, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,390 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగింది. దీంతో రూ.93,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగింది. దీంతో రూ. 1,02,440 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Landslide In Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో విషాదం: కొండచరియలు విరిగిపడి 31 మంది మృతి..!
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,590 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,30,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,20,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
